హౌజ్ మోషన్ కౌంటింగ్ కి ఏమీ అడ్డంకి కాదు : ఎలక్షన్ కమిషన్

-

బ్యాలెట్ పై ఎలాంటి ముద్ర ఉన్నా ఓటును పరిగణలోకి తీసుకోవాలనే సర్కులర్ పై హై కోర్టులో బీజేపీ హౌజ్ మోషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో జూమ్ మీటింగ్ ద్వారా పిటిషన్ను విచారించనున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అయితే ఆ వెసులుబాటు స్థానిక సంస్థల ఎన్నికల రూల్ బుక్ లో ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది. కౌంటింగ్ అబ్జర్వర్ల సమావేశంలో చర్చించి నిబంధనలపై స్పష్టత ఇచ్చామని చెబుతోంది.

అసలు మా కౌంటింగ్ ప్రక్రియకు హైకోర్టు విచారణ అడ్డంకి కాదని ఎన్నికల సంఘం చెబుతోంది. మధ్యాహ్నం 1 లేదా 2 గంటల వరకు ఫలితాల్లో స్పష్టత వస్తుందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. పెన్నుతో టిక్ చేసినా ఓటేసినట్టే అంటూ నిన్న పొద్దుపోయాక ఎన్నికల కమిషన్ ఒక సర్కులర్ జారీ చేసింది. బ్యాలెట్ లో స్వస్తిక్ గుర్తు  కాకుండా ఏ గుర్తు వేసిన ఆ ఓటును పరిగణించాలని ఈ సర్కులర్ జారీ చేశారు. దీంతో ఈ అంశం మీద హై కోర్టులో హౌజ్ మోషన్ దాఖలు చేసింది బీజేపీ. మరి కాసేపట్లో వాదనలు జరగనున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version