ఆహా… జగన్ నెత్తిన పాలు పోసిన ఎన్నికల సంఘం…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెత్తిన రాష్ట్ర ఎన్నికల సంఘం పాలు పోసిందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనక కారణం ఏమై ఉంటుంది. అనేది పక్కన పెడితే ఇది రాజకీయంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇది వేదికగా మారింది.

ప్రధానంగా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది పక్కన పెడితే సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్ ని అమలు చేయవద్దని ఆ కోడ్ తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సాధ్యం కాదు అనుకుంటున్న ఇళ్ల పట్టాలను మళ్లీ ఎన్నికల కోడ్ వచ్చే లోపు అమలు చేయాలని వాటిని ప్రజలకు పంచాలని పట్టుదలగా ఉంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇళ్ల పట్టాలను పంచి పెట్టాలని భావిస్తోంది.

ఒకవేళ ఎన్నికలు వాయిదా పడకుండా ఉండి ఉంటే వాటిని పంచి పెట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇది ఎన్నికల్లో వైసీపీ ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయడంతో పాటుగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్నీ పరిశీలించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసుకోవచ్చని స్పష్టంగా చెప్పింది. ఇవి అధికార పార్టీకి ప్రధానంగా కలిసి వచ్చే అంశం. వీలైనంత త్వరగా ఇళ్ల పట్టాలను పంచుకుంటే మాత్రం అధికార పార్టీకి భారీగా పేదల నుంచి ఓట్లు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version