తన పరువు అనవసరంగా పోగొట్టుకున్న రేవంత్..!

-

మల్కాజగిరి ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ యువనేత రేవంత్ రెడ్డి తన పరువు తానే తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డికి కాస్త దూకుడెక్కువ. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఆయన తక్కువ కాలంలోనే కాస్త ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఆయన కంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డికి గడ్డు కాలం నడుస్తోంది. భూ కబ్జా ఆరోపణ లో రేవంత్ రెడ్డి తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో వాటిపై విచారణ కూడా జరుగుతుంది. ఇది చాలదన్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇంటిపై డ్రోన్ ఎగరవేసిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు వారం రోజుల పాటు ఆయన చర్లపల్లి జైలులో గడిపారు కూడా.

జైలు నుంచి బెయిల్ పై  విడుదలైన సందర్భంగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ పట్టించుకోలేదు అంటూ అసహనం వ్యక్తం చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి స్థాయికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శంకించే అంత అర్హత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ పడితే అది పార్టీకి మంచిది కాదని,

ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాయితీ ఏమిటో తమకు తెలుసని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ,కేటీఆర్ డ్రోన్ ఇంటిపై ఎగరవేయడం జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేయడం వంటివి ఆయన ఇమేజ్ ను దెబ్బ తీసాయి. ఆయన అనవసరంగా తన పరువు పోగొట్టుకున్నారని అంటున్నారు. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే రేవంత్ రెడ్డి కి సొంత పార్టీలోనే పెట్టే ఆలోచనలో కొంతమంది నేతలు ఉన్నారు. ఆయనపై ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి కూడా ఫిర్యాదులు అందాయి. ఈ తరుణంలో జాగ్రత్తగా ఉండాల్సిన రేవంత్ రెడ్డి అనవసరంగా కొన్ని కొన్ని విషయాలలో తలదూర్చడం కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ కాంగ్రెస్ లో తాను తప్ప పార్టీకే దిక్కు లేదు అంటూ కొన్ని అనవసర వ్యాఖ్యలు చేయడంతో ఆయన పరువు ఆయన తీసుకుంటున్నారు మీ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version