ఎన్నికల సంఘం కీలక నిర్ణయం… ఈనెల 31 వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం పొడగింపు

-

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత పెరగుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో రోడ్ షోలు, ర్యాలీలపై ఈనెల 31 వరకు నిషేధం విధించారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓ వైపు ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈసీ బహిరంగ రోడ్ షోలు, ర్యాలీలను నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు, ఎన్నికలు జరగనున్న 5 రాష్టాల ఉన్నతాధికారులు,  ప్రధాన ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అధికారులు సూచనలు పరిగణలోకి తీసుకుని మరోసారి ర్యాలీలు, రోష్ షోలపై నిషేధం పొడగించింది.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8 న ప్రకటించిన ఈసీ, ఎన్నికల ప్రచార సభలను, రోడ్ షో లను, ఇతర ఎన్నికల ప్రచారాలను జనవరి 15 వ తేదీ వరకు నిషేధించింది. ఆ తరువాత దీన్ని 22 తేదీకి పొడగించింది. తాజాగా మళ్లీ సమావేశం అయిన ఈసీ ఈ నిషేధాన్ని ఈనెల 31 వరకు పొడగించింది. అయితే, రాజకీయ పార్టీలు ఇండోర్ సమావేశాలు నిర్వహించుకునేందుకు మాత్రం అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏదైనా సమావేశ మందిరంలో 300 మంది వరకు హాజరయ్యేందుకు, లేదా సమావేశ మందిరం సామర్ధ్యం లో 50 శాతం వరకు సమావేశమయ్యేందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version