మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే టమాటాతో ఇలా చేయండి

-

టమాట… ప్రతి వంట గదిలో దర్శనమిచ్చే కూరగాయ.  టమాట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి ఇంకా కె ఉండడం వల్ల చర్మానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రస్తుతం చర్మానికి టమాట చేసే మేలు ఏంటో తెలుసుకుందాం.

ముఖ్యంగా చర్మం అందంగా మెరవడానికి, జిడ్డుదనం పోవడానికి టమాట ఉపయోగపడుతుంది.

పై ఉపయోగాలు పొందాలంటే టమాటాను ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం.

టమాటా దోసకాయ మిశ్రమం చేసే మేలు:

టమాటాను బాగా నుజ్జు నుజ్జు చేసి పిప్పిని బయటపడవేసి పాత్రలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ తీసుకొని దాన్ని బాగా సన్నగా తరిగి టమాట రసంలో వేయాలి. ఈ రెండింటిని గ్రైండ్చే చేసి మిశ్రమాన్ని మొహానికి అద్దుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడగాలి.

వారానికి మూడుసార్లు ఈ విధంగా చేయవచ్చు. దీనివల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇంకా చర్మం మిలమిలా మెరుస్తుంది.

టమాటా పెరుగు మిశ్రమం:

టమాటాను ఉడకబెడితే వచ్చే రసాన్ని పెరుగులో కలుపుకుని మొహం మీద మాస్క్ వేసుకోవాలి. దీనికోసం టమాటా రసంలో రెండు చెంచాల పెరుగు కలపాలి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అంతేకాదు చర్మం తళతళ మెరుస్తుంది. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

టమాటా నిమ్మరసం మిశ్రమం:

టమాటలను ఉడకబెట్టి రసాన్ని పక్కన పెట్టి అందులో నిమ్మ రసాన్ని కలిపి మొహానికి మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మంచిది. ఇలా వారానికి ఒకసారి మాత్రమే చేయాలి, ఎక్కువసార్లు చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version