ఆసక్తికరంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు

-

ఈ రోజు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దాదాపు అన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాలు కావడంతో సర్వత్రా ఆశక్తి నెలకొని ఉంది. అదీకాక మూడు దక్షిణాది రాష్ట్రాలు కావడంతో తెలుగు వారు కూడా ఈ ఎన్నికల మీద ఆసక్తి చూపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో ఈరోజు ఒకే విడతలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి..

ఇక ఉత్తరాది రాష్ట్రాలు అయిన పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాలలో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు మూడో విడత ఎన్నికల కావడం గమనార్హం..అస్సాంలో ఈరోజుతో ఎన్నికలు పూర్తి కానుండగా బెంగాల్లో మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక ఈ ఎన్నికల దృష్ట్యా దాదాపు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. దీంతో గెలుపు తమదే అనేది దాదాపు అన్ని పార్టీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version