విదేశీ కరెన్సీల మారకపు విలువ ఎక్కువ.. ఎందుకంటే..!

-

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డబ్బుని.. డాలర్, దినార్, రియల్, పౌండ్, రూపాయి ఇలా చాలా రకాలుగా పిలుస్తారు. వీటి మారకం విలువ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందలకుపైగా దేశాలు ఉన్నాయి. వీటిలో అమెరికా డాలర్‌కు మాత్రమే అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రామాణికంగా భావిస్తారు. అంతర్జాతీయ మార్కెటింగ్, ఎగుమతులు, దిగుమతులు, కొనుగోళ్లు, చెల్లింపులు వంటి క్రయవిక్రయాలన్నీ అమెరికా డాలర్‌తోనే జరుపుతూ ఉంటారు. ఒక్క డాలర్ భారత రూపాయి మారకం విలువ సుమారు రూ.72గా ఉంటుంది. రూపాయి మారకం విలువ కంటే డాలర్ మారకం విలువకు మించి కొన్ని విదేశాలు తమ కరెన్సీని కలిగి ఉన్నాయి. ఆ దేశాల గురించి.. వాటి కరెన్సీల గురించి తెలుసుకుందాం.

foreign-couurency

కువైట్ – దినార్
ప్రపంచవ్యాప్తంగా కువైట్ అనేది చాలా చిన్న దేశంగా కొనసాగుతోంది. ఇక్కడ చమురు నిక్షేపాలు అధికంగా ఉంటారు. అందుకే ఈ దేశం సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ఎగుమతులు చేసే దేశాల్లో కువైట్ కూడా ఉంది. కువైట్ కరెన్సీ దినార్. ఇండియన్ రూపాయి మారకం విలువ దినార్‌కు రూ.239.91గా ఉంటుంది. అంటే దాదాపు 3.31 యూఎస్ డాలర్లు ఉంటుంది.

బహ్రెయిన్ – దినార్
బహ్రెయిన్.. గల్ఫ్ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యంగా ఉంటోంది. ఇక్కడ దాదాపు 100పైగా దీవులు ఉన్నాయి. ఈ దీవుల్లో పెట్రోలియం అధికం. అందుకే పెట్రోల్‌ను ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. బహ్రెయిన్ దినార్ 2.65 డాలర్లతో సమానం. అంటే దీని మారకం విలువ రూపాయితో పోల్చితే రూ.192.27గా ఉంది.

ఒమన్ – రియల్
ఒమన్ దేశం అరేబియా సముద్ర తీరాన ఉంది. ఈ దేశం యూఏఈ, సౌదీ, యెమెన్ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. ఈ దేశ జనాభా 25 లక్షలకుపైగా ఉంటుంది. ఇక్కడ పెట్రోలియం వనరులు ఎక్కువగా ఉంటుంది. దీనిపైనే దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఒమన్ దేశ కరెన్సీ రియల్. ఇది 2.60 డాలర్‌తో సమానంగా ఉంటుంది. రూపాయి మారకం విలువతో పోల్చితే ఇది రూ.188.29గా ఉంటుంది.

జోర్డాన్ – దినార్ / యూకే –పౌండ్
జోర్డాన్ దినార్‌ 1.41 డాలర్లకు సమానం. రూపాయి మారకం విలువతో పోల్చితే దీని విలువ రూ.102.25 ఉంటుంది. అలాగే యూకే దేశ కరెన్సీ పౌండ్. ఒక్క పౌండ్ 1.38 డాలర్లతో సమానం. దీని రూపాయి మారకం విలు రూ.100.38గా ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంను బట్టి కాలంతోపాటు విదేశీ మారకం విలువ ప్రతిరోజు మారుతూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version