స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. గ్రామాల్లో హామీల అడుగుకు ముందడుగు వేయాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు నిధుల మంజూరుకు మంత్రుల అనుమతి కోరాలన్నారు. మరోవైపు బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులు కేటాయించే బాధ్యతను వారికే అప్పగించారు.
ఇటీవలే అసెంబ్లీ కులగణన, ఎస్సీ వర్గకరణ నివేదికను అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 15న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడు వెల్లడిస్తుందో వేచి చూడాలి మరీ.