సింగరేణి బొగ్గు గనుల్లో లభ్యమైన ఏనుగు దంతాలు …!

-

మామూలుగా మనకు రామగుండం సింగరేణి గనులంటే గుర్తుకు వచ్చేది బొగ్గు మాత్రమే. అయితే తాజాగా సింగరేణి గనుల్లో హఠాత్తుగా ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. సింగరేణి గనులలో ఒకటైన మేడిపల్లి ఓసిపి లో కార్మికులు బొగ్గు తవ్వుతుండగా వారికి భూమిలో నుండి ఏనుగు దంతాలు బయటపడ్డాయి. దీనితో వారు వెంటనే ఆ ఏనుగు దంతాలను తీసుకవెళ్లి అధికారులకు అందించారు. ఆ తర్వాత సమాచారాన్ని పురావస్తు శాఖ సిబ్బందికి సింగరేణి గనులు అధికారులు తెలియజేశారు.

elephant-teeth

పురావస్తు శాఖ అధికారులు అక్కడికి చేరుకొని వాటిని పరిశీలన చేస్తున్నారు. ఇక అధికారులు అంచనా ప్రకారం క్రితం రోజులలో ఇక్కడ ఏమైనా ఏనుగులు సంచరించేవేమో అని, అలా వాటి మరణాంతరం భూమిలో కలిసిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు అక్రమంగా ఎవరైనా తెచ్చి ఇక్కడ భద్రపరిచి ఉండవచ్చునని విషయంపై కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు. ఏది ఏమైనా బొగ్గు గనులలో ఏనుగుల దంతాలు దొరకడం నిజంగా విడ్డూరమే. పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి వాటి వివరాలను తెలపాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version