రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ – 19 వ్యాధి మరింతగా పెరుగుతున్న సంగతి గమనిస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏకంగా 33 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఏకంగా కార్యాలయాన్ని పూర్తిగా మూసేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఉన్న జిల్లాలలో గుంటూరు జిల్లా కూడా ఒకటి. నిన్న ఒక్కరోజే గుంటూరు జిల్లాలో ఏకంగా 150 పైగా కేసులు నమోదయ్యాయి. దీనితో జిల్లా ప్రజలు కరోనా వైరస్ దెబ్బకి హడలిపోతున్నారు.
మహిళా శిశు సంక్షేమ రాష్ట్ర శాఖ కార్యాలయంలో కరోనా కలకలం …!
-