ఏలూరు ఘటనపై ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. వింత వ్యాధి మీద కారణాలను తెలుసుకునేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు. 21 మంది సభ్యులతో హైపవర్ కమిటీ వేయగా ఈ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ పని చేయనున్నారు. కన్వీనర్ గా ఆరోగ్య శాఖ ప్రినిపల్స్ సెక్రెటరీ వ్యవహరించనున్నారు. నివారణ చర్యలు కూడా సూచించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడ్డ 609 మందిలో 543 మంది ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిలో 33 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఇక ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. ఇక ఈ వింత వ్యాధికి తాగునీరే కారణమని అనుమానాలు బలపడుతున్నాయి. తాగునీటిలో మిథైన్ డై క్లోరైడ్ (డీపీయం) ఉన్నట్లుగా ఒక సంస్థ గుర్తించినట్టు చెబుతున్నారు. పరిమితికి మించి డీపియం విపరీతంగా ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే బాధితులకు మూర్ఛ లక్షణాలు ఉన్నాయని అంటున్నారు.