ఎక్కువ పెన్షన్‌ కావాలనుకునే ఉద్యోగులు జూలై 11 లోగా ఈ వివరాలు అప్‌డేట్‌ చేయండి..!

-

ఉద్యోగుల పెన్షన్‌ అకౌంట్‌.. ఈపీఎఫ్‌ ఉన్నవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఈ ఖాతా ముఖ్య ఉద్యేశం ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ ఇవ్వడమే. మీరు ఎక్కువ మొత్తంలో పెన్షన్‌ తీసుకోవాలంటే ఈ వార్తను జాగ్రత్తగా చదవండి. అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవాలనుకునేవారికి జూలై 11 వరకు గడువు పొడిగించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).

హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవాలనుకునేవారికి జూలై 11 వరకు అవకాశం ఉంది. వేతన వివరాలను సరిచూసుకోవాల్సిన యాజమాన్యాలకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు మరో మూడు నెలల గడువు ఇచ్చింది ఈపీఎఫ్ఓ. సబ్‌స్క్రైబర్లకు గడువు పెంచడం ఇది మూడోసారి. అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్ ఖాతాదారుల్లో పలు సందేహాలు ఉండటంతో గడువు పొడిగిస్తూ వస్తోంది ఈపీఎఫ్ఓ.

ప్రస్తుతం ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం మాత్రమే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లోకి వెళ్తోంది. పదవీ విరమణ తర్వాత సాధారణ పెన్షన్ కోసం ఈ కంట్రిబ్యూషన్ ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం ఈపీఎఫ్ఓ పరిగణించే గరిష్ట పరిమితి రూ.15,000 మాత్రమే. ఈ లెక్కనే 8.33 శాతానికి రూ.1,250 మాత్రమే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో జమ అవుతోంది. మిగతా బ్యాలెన్స్ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది.

రూ.15,000 లిమిట్ కాకుండా ఉద్యోగులు తమ బేసిక్ వేతనంపై కాంట్రిబ్యూషన్ ఎంచుకుంటే ఈపీఎస్‌లో జమ చేసే మొత్తం పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత లభించే పెన్షన్ కూడా పెరుగుతుంది. ఒక ఉద్యోగి కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హత లభిస్తుంది.

సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఇచ్చింది. ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ పోర్టల్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్ పొందడానికి అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అధిక పెన్షన్ అర్హతకు సంబంధించి గైడ్‌లైన్స్‌ను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది.

ఎవరు అర్హులు..

ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో ఉన్న అర్హతల ప్రకారం.. రూ.5,000 లేదా రూ.6,500 కంటే ఎక్కువ వేతనం ఉన్నప్పుడు ఈపీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేసినవారు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. EPS-95లో సభ్యులుగా ఉండగా, ముందస్తు సవరణ పథకం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద ఉమ్మడి ఎంపికను వినియోగించుకున్న EPFO సబ్‌స్క్రైబర్ కూడా ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version