జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు విజయం లభించింది. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతా బలగాల చేతిలో ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా చవల్గామ్ ప్రాంతంలో జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదిని మట్టు బెట్టారు. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు అదే ప్రాంతంలో ఉన్నట్లుగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. వారి కోసం సోదాలు నిర్వహిస్తున్నారు. సీఆర్పీఎఫ్, పోలీసుల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి భద్రతా దళాలకు సమాచారం అందడంతో ఆపరేషన్ ప్రారంభమైంది.
గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ జరగుతోంది. ఇటీవల ఓహస్పిటల్ నుంచి ఉగ్రవాదులు పరారయ్యారు. మరోవైపు కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సాధారణ పౌరులను టార్గెట్ చేస్తూ చంపేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇలాగే ఇద్దరిని చంపెశారు. దీంతో ఉగ్రవాదుల కదలికలను భద్రతా బలగాలు నిషితంగా గమనిస్తున్నాయి. ఎక్కడ అనుమానం వచ్చినా పెద్ద ఎత్తున్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు పాక్ ఇండియా సరిహద్దుల్లో భద్రతను ముమ్మరం చేశారు.