అమెరికా పర్యటన ముగింపు.. ఏపీ బయల్దేరిన మంత్రి నారాలోకేశ్

-

పెట్టుబడులు ఆకర్షించేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన ఏపీ ఐటీ,పరిశ్రమల మంత్రి నారా లోకేశ్ తన పర్యటనను ముగించుకుని శుక్రవారం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించారు.వారం రోజుల పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు, ప్రెసిడెంట్‌లు, వైఎస్ ప్రెసిడెంట్‌లను మంత్రి నారాలోకేష్ కలిసిన విషయం తెలిసిందే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.వైజాగ్‌‌లో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ సీఈకు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా యువతలో నైపుణ్యాభివృద్ధి,స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో పెట్టుబడులకు సహకరించాలని కోరారు. ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు.గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విన్నవించారు. ఇన్వెస్ట్‌మెంట్లకు ఇదే సరైన సమయమని లోకేష్ చెప్పినట్లు సమాచారం. కాగా, వారం రోజులుగా అగ్ర కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో లోకేష్ వరుస భేటీలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version