దసర నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయంలో శనివారం దుర్గమాత అమ్మవారు రాజరాజేశ్వరి దేవీగా దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బెజవాడలని దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిలో అమ్మవారికి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 11 గంటలకు అర్చకులు చివరగా పూర్ణాహుతిని అమ్మవారికి సమర్పించనున్నారు.
దీంతో ఇంద్రకీలాద్రి కొండ మీద కనకదుర్గమ్మ శరన్నవరాత్రులు ముగియనున్నాయి. దసరా పండుగ సెలవులు, నవరాత్రులు చివరి రోజు కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి కొండమీద రష్ ఎక్కువ అయ్యింది. అమ్మవారి దర్శనం కోసం గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు.