జగిత్యాల ఫారెస్టు కార్యాలయంలో దసరా పండుగ నేపథ్యంలో ఘనంగా దావత్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి జిల్లాలోని ఫారెస్టు సిబ్బంది, కొందరు బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు సైతం హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. జిల్లా కార్యాలయంలో పార్టీ చేసుకోవడంతో పాటు అటవీలోని వన్యప్రాణుల మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దసరా దావత్ చేసుకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జాతీయ పక్షి నెమలి, అడవి పంది మాంసాన్ని దావత్‌లో వినియోగించారని అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. ఈ క్రమంలోనే మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.దీని గురించి తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు ఫారెస్టు ఆఫీసర్లను ప్రశ్నించగా మీడియాపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. అంతేకాకుండా తనకు సమాచారం లేదన్న జిల్లా అటవీ శాఖ అధికారి ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని అటవీ శాఖ అధికారి తెలిపారు.