ముగుస్తున్న ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం.. వైసీపీకీ క‌లిసొచ్చే అంశం

-

ఏపీలో వైసీపీకి క‌లిసొచ్చే అంశం ఏదైనా ఉందా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీల గ‌డువు ముగియ‌డ‌మే. ఇప్పుడు ఏపీ మండ‌లి చైర్మ‌న్ అహ్మ‌ద్ ష‌రీఫ్ ప‌ద‌వికాలం మే 31తో ముగుస్తోంది. ఈయ‌న‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కూడా ఎమ్మెల్సీనే. ఈయ‌న ప‌ద‌వి కూడా మే31తో ముగుస్తోంది. ఇది వైసీపీకి క‌లిసొచ్చే అంశ‌మ‌ని చెప్పాలి. ఎలా అంటే.

 

మూడు రాజ‌ధానుల అథారిటీ బిల్లుల‌పై అహ్మ‌ద్ ష‌రీఫ్ అడ్డుత‌గులుతున్నాడ‌ని వైసీపీ ఎప్ప‌టి నుంచో ఆగ్ర‌హం మీద ఉంది. ఈయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఇప్పుడు వైసీపీ ఈ సీటును కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తోంది.

అసెంబ్లీలో భారీ సంఖ్యాబ‌లం ఉన్న వైసీపీ ఈ సీటును ఈసీగా కైవ‌లం చేసుకోనుంది. ఇదే జ‌రిగితే వైసీపీకి ఇక మండలిలో ఎదురులేకుండా ఉండ‌నుంది. దీంతో ఈజీగా మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను ఈజీగా పాస్ చేసుకోవాల‌ని చూస్తోంది. కాక‌పోతే ఈసీ ఈ ఎన్నిక‌ల‌ను ఇప్పుడు నిర్వ‌హించ‌లేమ‌ని చెబుతోంది. క‌రోనా తీవ్ర‌త త‌గ్గాక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version