మనదేశంలో ఇంజనీరింగ్ విద్యకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దాదాపుగా పదిమందిలో ఆరుగురికి పైగా ఇంజనీరింగ్ చదువుతున్నారు. అందువల్లే భారతదేశానికి సాఫ్ట్ వేర్ కంపెనీలు విరివిగా వచ్చేస్తుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలు సాఫ్ట్ వేర్ నిలయాలుగా ఉన్నాయి. ఐతే ఇంజనీరింగ్ బీటెక్/బీఈ చదివే విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సరికొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది.
ఇకపై ఇంజనీరింగ్ చదివే వారు ఏకకాలంలో రెండు కోర్సులను చదివేందుకు వీలు కల్పించింది. ప్రధాన కోర్సుగా ఒకటి ఉండగా, అదనంగా మరో కోర్సును చదవడానికి అనుమతులు ఇచ్చింది. ఈ ప్రతిపాదన చాలా రోజుల క్రితమే ఏఐసీటీఈ ముందుకు వచ్చింది. ప్రస్తుతం దీన్ని అమలు చేయడానికి ఏఐసీటీఈ సిద్ధ పడింది. దీని ప్రకారం కొత్తగా జాయిన్ అయ్యేవారు తమకి ఇష్టమైన రెండు కోర్సులకు ఒకే సంవత్సరకాలంలో చదవచ్చు.
అల్రెడీ మొదటి సంవత్సరం పూర్తయిన వారిని ఇందులో నుండి మినహాయించింది. రెండవ సంవత్సరం నుండి ఏం చేయాలనేది వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసీటీఈ రూపొందించిన వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.