ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త. జీతం పొందే ఉద్యోగుల కోసం విశ్వసనీయ పెట్టుబడి పథకం ఉంది. ఉద్యోగులు డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులు అర్హుల కావచ్చు. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా.. రూ. 7 లక్షల వరకు జీవిత బీమా ప్రయోజనాలు పొందవచ్చు. బీమా ప్రయోజనాలే కాకుండా EDLI పథకం ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. దీని కింది ఖాతాదారుడు మరణించిన సందర్భంతో అతని కుటుంబానికి లేదా వారసుడికి రూ. 7 లక్షల వరకు బీమా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. గతంలో ఇది రూ. 6 లక్షల వరకే ఉండేది.. అయితే ఈ ఏడాది ఎప్రిల్ లో దీన్ని రూ. 7 లక్షలకు పెంచారు.