EPIL రిక్రూట్మెంట్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాన్ని పొందొచ్చు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ లో 11 అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టులు వున్నాయి.

 

jobs

అర్హత వివరాలని చూస్తే పోస్టును బట్టి 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రెండేళ్ల నుండి నాలుగేళ్ళ అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. ఇక ఇదిలా ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు నవంబర్‌ 29, 2022వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సాలరీ విషయానికి వస్తే నెలకు రూ.40,000ల నుంచి రూ.50,000ల వరకు జీతం ఇస్తారు. అలానే అలవెన్సులు కూడా ఉంటుందని చెప్పారు. అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు నార్త్ ఈస్టర్న్ రీజినల్ ఆఫీస్ – గువాహటి కి అప్లై చేసుకోవాల్సి వుంది. పూర్తి వివరాలను https://epi.gov.in/content/innerpage/career.php లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version