ESI కార్డు ఉందా..? అయితే ఇలా వైద్యం తీసుకోండి…!

-

ఈఎస్ఐసి హాస్పిటల్ కనుక మీ ఇంటికి పది కిలో మీటర్ల దూరం లో లేకపోతే ఆ ఉద్యోగి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం తీసుకోవచ్చు. ఈ విషయం గురువారం నాడు ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే ఈఎస్ఐసి ని విస్తరించినట్లు చెప్పారు. పైగా దీని నుంచి లాభాలు పొందే వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు అని అన్నారు. దీని మూలం గానే దీనిని క్రమంగా అభివృద్ధి చేస్తున్నట్లు, అలానే సౌకర్యాలను కూడా పెంచుతున్నట్లు చెప్పారు.

అలానే ఉద్యోగస్తులు ఇళ్లకి దగ్గర లోనే సౌకర్యాలు కూడా రానున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కష్టాలు వాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. దీని మూలంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే ఈఎస్ఐసి ఆస్పత్రి లో చికిత్స తీసుకోవచ్చు అని దీని మూలంగా కేవలం కొన్ని చోట్ల మాత్రమే వెళ్లాల్సిన పని లేదు.

అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ని తీసుకువెళ్లాలి OPD సర్వీసులు దగ్గరకి రోగులు వెళ్లి ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు. దాని కోసం తప్పకుండా ఈఎస్ఐ ఐడెంటిటీ కార్డ్ మరియు హెల్త్ పాస్ బుక్ చూపించాలి. ఆధార్ కార్డు కూడా మీతో పాటు తీసుకువెళ్లాలి గమనించండి. దీనితో సులువుగా వైద్యాన్ని తీసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి డిస్పెన్సరీ లేదా ఈఎస్ఐసి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళాలి. ఆస్పత్రిలో చేర్పించే అవసరం ఉంటే 24 గంటల లోపు ఆన్లైన్ ద్వారా ఆస్పత్రి సిబ్బంది ఆఫీసర్ నుంచి అనుమతి పొందాలి. ఇలా చేయడం వల్ల డబ్బులు ఇవ్వకుండా మీరు వైద్యాన్ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version