అందరి లిస్టు నా దగ్గర ఉంది… ఏం చెయ్యాలో అది చేస్తా: ఈటెల

-

టీఆరెస్ లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతారు అంటూ మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర మండిపడ్డారు. రాసిచ్చింది మాట్లాడటం తప్ప.. సొంతంగా మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదు అంటూ ఆయన మీడియాతో మాట్లాడిన మంత్రులపై మండిపడ్డారు. ఇరవై ఏళ్లలో ఆ పార్టీలో చాలా చూశా అని అన్నారు. అందరి లిస్ట్ నా దగ్గర ఉంది అని మంత్రులుగా కాదు.. మనుషులుగా మాట్లాడండి అంటూ ఆయన సూచించారు.

కనీసం ఆ మంత్రులకు అయినా ఇకనుంచి కేసీఆర్ గౌరవం ఇవ్వాలని కోరుతున్నా అని అన్నారు. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేసారు. నేను ఎవరి గురించి కామెంట్ చేయను అని నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది తెరాస, సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యలు చేసారు. పార్టీ కి వ్యతిరేకంగా పని చేయలేదు అని స్పష్టం చేసారు. కేటిఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.. నేనే స్వాగతించాను అంటూ వ్యాఖ్యలు చేసారు. నాతో ఎవరేం మాట్లాడినారో నాకు తెలుసు అని, సీఎం అహంకారం పై మంత్రులే మాట్లాడారు అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కు ఇంత అహంకారం ఉంటదా అన్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version