బ్రేకింగ్: తెలంగాణాలో మరో ఉద్యమం మొదలయింది… ఎంగిలి మెతుకులు తినను: ఈటెల

-

తెలంగాణ లో మరో ఉద్యమం మొదలైంది అని మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యాఖ్యలు చేసారు. అది ఆత్మ గౌరవ ఉద్యమం అన్నారు ఆయన. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా? అనే అంశంపై ఈటల కి మద్దతుగా.. తెలంగాణ NRI అమెరికా ఫోరం ఆధ్వర్యంలో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురు NRI లతో మాట్లాడిన ఈటల ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు.

పూర్తిగా తప్పుడు ఆరోపణలతో నన్ను బయటికి పంపిచారని ఆయన ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో నా మొత్తం వ్యాపారం మీద సంపాదించిన ఆస్తుల మీద విచారణ చేయించండి అని సీఎం నీ కోరిన అని వివరించారు. ఎంగిలి మేతుకుల కోసం ఆశపడను అని స్పష్టం చేసారు. ప్రజల ను నమ్ముకున్నాను అన్నారు. ప్రలోభాలకు లొంగ లేదు కాబట్టే ఈ నిందలు వేస్తున్నారని వ్యాఖ్యలు చేసారు. NRI ల మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version