టిఆర్ఎస్ నుంచి బయటికి పోవాలంటే బాధ అనిపించింది : ఈటల

-

టిఆర్ఎస్ పార్టీ మరోసారి విరుచుకుపడ్డారు ఈటల రాజేందర్. ప్రచారంలో భాగంగా ముదిరాజ్ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మా పొత్తుల సద్ది అని అన్ని కులాల వారు, మతాల వాల్లకు మద్దతు చెప్తూ మీటింగులు పెట్టారని.. తాను ప్రజలకు కొత్త కాదు, కానీ 18 సంవత్సరాల కొట్లాట వేరు ఇప్పుడు కొట్లాట వేరన్నారు.

etala

ముదిరాజ్ లను కదిలిస్తే తేనె తెట్టెను కదిలించినట్టేనని ఈటల వార్నింగ్ ఇచ్చారు. అది తెలంగాణ తల్లి విముక్తి కోసం.. ఇప్పుడు కెసిఆర్ అన్యాయాల మీద, అక్రమాల మీద కొట్లాట అని పేర్కొన్నారు. అప్పటి కెసిఆర్ ఉద్యమాన్ని, ప్రజలను నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు, మద్యం, అధికారం నమ్ముకున్నాడని ఫైర్ అయ్యారు.

కురుక్షేత్రం లో యోధాన యోధులు కౌరవుల వైపు ఉన్నా ధర్మం పాండవుల వైపు ఉన్నారు కాబట్టి పాండవులు గెలిచారని.. . ఇప్పుడు కూడా ధర్మం వైపు ఉన్న మనం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. 101 సార్లు చెప్తే అబద్దం నిజం అవుతుందని కెసిఆర్ ప్రచారం చేస్తున్నారని.. ఆయన చేసే అన్యాయాన్ని చీల్చి చెండాడాలని పిలుపునిచ్చారు. తెరాస పార్టీ నుండి బయటికి పోవాలంటే బాధ అనిపించిందని.. తనను కావాలనే బయటకు పంపించారని ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version