కలెక్టర్ కి చెప్పినా వినలేదు..ఈవీఎంలు మార్చినట్లు తెలుస్తుంది : ఈటల

-

హుజురాబాద్‌ పోలింగ్‌ పై ఈటల రాజేందర్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని… వారు ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని… డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదన్నారు.
ఎమ్మెల్యే లు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారని… బస్సుల్లో ఇవిఎం కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయని ఆరోపించారు ఈటల.

EVM కరాబ్ అయినవి అని మార్చడం అనుమానాలకు తెర లేపిందని… తనను ఓడించడానికి కెసిఆర్ అన్ని ప్రయత్నాలు చేశారని ఫైర్‌ అయ్యారు. డబ్బులు పంచారు, మందు పంచారు, బెదిరించారు, మభ్యపెట్టారని… చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అన్నీ చేసిన కూడా గెలవలేక ఇలాంటి పనులు చేస్తున్నారని… ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఈ విషయంపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేస్తున్నామని… హుజురాబాద్ ప్రజల ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కలెక్టర్ పొరపాటు జరిగింది అని చెప్తున్నారు… ఇది మామూలు ఎన్నిక కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version