మనకు అందాన్ని తెచ్చేది చక్కని చిరునవ్వు. ఆ స్మైల్ బాగుండాలంటే..ముత్యాలాంటి పళ్లు ఉండాలి. లేదంటే మనం నవ్వినప్పుడు పళ్లు పచ్చగా, గారలుపట్టి ఉన్నాయంటే ఏం బాగుంటది చెప్పండి. అదే తెల్లటి పళ్లు ఉంటే..అమ్మాయిలతే మంచి లిప్ స్టిక్ వేసరంటే..ఇక ఆ నవ్వు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో కదా. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే..పళ్లు క్లీన్ గా గారలుపట్టి ఉంటే ఎదుటివారు చూడగానే బాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మనసారా నవ్వినప్పుడే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పదిమందిలో నోరుతెరిచి మాట్లాడాలన్నా ధైర్యం వస్తుంది.
అయితే ఇలా పళ్లూ పచ్చగా మారటానికి చాలా కారణాలు ఉంటాయి. కొందరు బ్రష్ సరిగా చేయక, పొగ తాగటం, కూల్ డ్రింగ్ తాగటం , ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే తాగే నీళ్లలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా పాపం వారు శుభ్రంగా పళ్లు తోముకున్నా అవి పచ్చగానే ఉంటాయి. అయితే ఇప్పుడే చెప్పే చిట్కాలు పాటిస్తే మీ పళ్లు మిలమిలా మెరిసిపోతాయంట. అవేంటంటే..
1. బేకింగ్ సోడాకు కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌తో పళ్లు తోముకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత మంచి నీటితో పళ్లను క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకటి రెండు సార్లు చేస్తే మీ పళ్లు మిలమిల మెరుస్తాయి. అయితే చిగుర్లకు అంటకుండా తోమండి. చిగుర్లు చాలాసున్నితంగా ఉంటాయి. మీరు పళ్లు తోమినట్లు చిగుర్లను కూడా తోమితే నోరు పూసే ప్రమాదం ఉంది. కాబట్టి నిదానంగా జాగ్రత్తగా పళ్లను మాత్రమే తోమాలి.
2. పళ్లపై మరకలు పోగట్టడంలో యాపిల్ సిడర్ వెనిగర్ బాగా పనిచేస్తుందట. రెండు టేబుల్ స్పూర్ల యాపిల్ సిడర్ వెనిగర్‌ని కప్పు నీళ్లలో పోసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో నోటిని ఒకటి రెండు సార్లు పుక్కిలించాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పళ్లు తెల్లగా అవుతాయట.
3. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో పోసి పుక్కిలించాలి. అవును నిజమే..నూనెను నోట్లుపోసోకోండి. మింగకండి. 10 నిమిషాల పాటు అటూ ఇటూ బాగా పుక్కించాలి. ఆ తర్వాత నూనె ఉమ్మివేసి.. మంచి నీటితో నోటిని కడుక్కోవాలి. అనంతరం బ్రష్ చేయాలి. ఇలా చేస్తే పళ్లపై పాచి ఎక్కువగా పట్టదట.
4. అరటిపండు, నారింజ, నిమ్మ తొక్కలతో పళ్లపై బాగా రుద్దాలి. అందులో సిట్రిక్ యాసిడ్ పళ్లు తెల్లగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. వీటితో పళ్లు తోమిన తర్వాత మంచి నీటితో నోటిని శుభ్రంచేసుకోవాలి.
5. ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది బొగ్గుతో పళ్లు తోముతుంటారు. నిజానికి అది చాలా మంచిపద్దతి.. పళ్లపై ఉండే బ్యాక్టీరియా, ఇతర మలినాలనుబ బొగ్గు తొలగిస్తుంది. అందుకే అప్పుడప్పుడే బొగ్గు పొడితో పళ్లు తోముకుంటే మరకలు పోతాయి. పాచి కూడా పట్టదు.
ఈ చిట్కాలలో మీకు నచ్చింది ఏదో ఒకటి ఫాలో అవ్వండి..ఒకేసారి పళ్లు తెల్లగా మారాలని అన్నీ ఒకేరోజు చేస్తే నోటిసమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. మెల్లిమెల్లిగా పళ్లు రాగుమారతూ వస్తాయి. ముందు మీరైతై ప్రయత్నం మొదలుపెట్టండి.
– త్రివేణి బస్కరోవుతు