హ్యచరీస్ భూముల పంపిణీపై ఈటల జమున హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కి సవాల్ విసురుతున్నా.. రేపు ముఖ్యమంత్రి..అధికారులు రావాలి.. మా పట్టా భూమి మూడెకరాలు ఎక్కడ ఉందో చూపిచ్చిపోవాలని జమున ఛాలెంజ్ చేశారు. ఎక్కడకు రమ్మంటే అక్కడికి రావాడానికి తాను సిద్దమని.. నిన్న పట్టాలిచ్చాము అని చెబుతున్నారు.
పట్టాలిచ్చిన సర్వే నెంబర్లు వేరు… మా సర్వే నెంబర్లు వేరు అని తెలిపారు జమున. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారు.. ఆ సర్వే నెంబర్లలో మాకు గజం భూమి కూడా లేదని వెల్లడించారు. ముఖ్యమంత్రికి కూడా ఈ విషయం తెలుసు.. చదువుకున్నోళ్లకు జ్ఙానం ఉండాలని చురకలు అంటించారు.
80 ఎకరాల భూమి అని చెబుతున్నారు.. మాకుంది మొత్తం 58 ఎకరాల భూమి అన్నారు. ఉన్న భూమి మొత్తం అమ్మిన కూడా కేసీఆర్ మీద పోరాడుతాం.. మేము కొన్నది పట్టా ల్యాండ్ అని తెలిచి చెప్పారు జమున. అదంతా కబ్జా భూమి అని ప్రచారం చేస్తున్నారు.. జమున హ్యాచరీస్‌లో ఎందుకు వచ్చారు..అక్కడ టెంట్ ఎందుకు వేశారని ఫైర్ అయ్యారు జమున.