కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తన రూపు మర్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్ల రూపంలో తిరిగి అటాక్ చేస్తోంది. ఇటీవల కాలంలో రష్యా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో WHO యూరప్ దేశాలను హెచ్చరిస్తోంది. రానున్నవారాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరుగనుందని తెలిపింది. WHO గణాంకాల ప్రకారం ఈ వారం యూరప్ దేశాల్లో 1.8 మిలియన్ల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే దాదాపుగా 6 శాతం అధికం. మరోవైపు ఒక్కవారంలోనే 24 వేల మరణాలు చోటుచేసుకున్నాయి. గత వారంతో పోలిస్తే మరణాల శాతం 16కు పెరిగింది.
యూరప్ దేశాలకు WHO హెచ్చరిక..!
-