బ్రేకింగ్ : పండుగ పూట హీరో రాజశేఖర్ ఇంట విషాదం..!

-

టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట విషాదం నెలకొంది. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం వరదరాజన్ గోపాల్ అనారోగ్యం బారిన పడ్డారు. దాంతో ఆయనను హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు సాయంత్రం కన్ను మూశారు. రాజగోపాల్ చెన్నైలో డీఎస్పీగా విధులు నిర్వహించి రిటైరయ్యారు.

Hero Rajashekar father no more

ఆయనకు మొత్తం ఐదుగురు సంతానం ఉండగా అందులో ముగ్గురు కుమారులు… ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదరాజన్ కు హీరో రాజశేఖర్ రెండో సంతానం కాగా మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు.. వ్యాపారాలు చేస్తూ స్థిరపడగా రాజశేఖర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శుక్రవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ మృతదేహాన్ని చెన్నై కి తీసుకు వెళ్ళనున్నారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version