మీలో ఎవరు కోటీశ్వరుడు: మా నాన్న నాకు ఆచార్య..మా బాబాయ్ నాకు స్నేహితుడు.. ఆసక్తికరంగా మొదటి ఎపిసోడ్. 

-

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వస్తున్న  మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధిగా మొదటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ అతిధిగా రావడం అభిమానులను ఉర్రూతలూగించింది. ఇద్దరు ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఒకే తెరపై చాలా నిండుగా కనిపించారు. ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే ఇద్దరు టాప్ హీరోలని ఒకే తెరపై చూసే అవకాశం ఎవరు మీలో కోటీశ్వరుడుతో లభించింది.

ఇక కార్యక్రమంలోకి వెళ్తే, ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొదటగా గురువు అనే ప్రశ్నకు పర్యాయపదం ఏది అన్న ప్రశ్నకు ఆచార్య అన్న ఆప్షన్ ఎంచుకున్న రామ్ చరణ్, మా నాన్నే నాకు ఆచార్య అని అన్నాడు. దాంతో ఎన్టీఆర్, నాకు కూడా ఆయన ఆచార్యే అని అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై ఒక ప్రశ్న అడిగారు. దానికి జవాబు చెప్పిన రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్ కి ఉన్న రిలేషన్ షిప్ ని చెప్పుకొచ్చాడు.

నాన్న షూటింగులతో బిజీగా ఉన్నప్పుడు బాబాయ్ తో ఎక్కువ సమయం గడిపేవాడినని, చాలా విషయాలు బాబాయ్ తో పంచుకునేవాడినని, ఒక స్నేహితుడిలా ఉండేవాడినని మాట్లాడారు. మొత్తానికి మొదటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అటు రాఖీ పండగ, ఇటు మెగాస్టార్ పుట్టిన రోజు, ఇక్కడ ఇద్దరు టాప్ హీరోలు.. అంతా కలిసి పండగ వాతావరణాన్ని మరింత పెంచారు. అభిమానులకు ఆనందాన్ని పంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version