పంజ్‌షిర్‌‌లో ఉద్రిక్తత.. 300 మంది తాలిబన్లు మృతి !

-

అఫ్ఘానిస్తాన్‌లో రాజ్యంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. తాలిబన్ల భయానికి చాలా మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలేసి.. ఇతర దేశాలకు తరలిపోతున్నారు. ఇది ఇలా ఉండగా… పంజ్‌షీర్‌.. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల వశం కాని ప్రాంతం ఇదొక్కటే..! అంతేకాదు.. తాలిబన్లు కాబుల్‌కి చేరుకోవడంతో అనేక మంది సైన్యం పంజ్‌షీర్‌కి పారిపోయారు. వారి సైన్యంతో కలిశారు. నార్తన్ అలయన్స్‌ పేరుతో బలమైన శక్తిగా మారాయి. తాలిబన్‌లపై దాడులకు దిగుతున్నాయి. ఇప్పుడు అక్కడ మళ్లీ యుద్దం మొదలైంది. పంజ్‌షీర్‌ను చేజిక్కించుకునేందుకు వందలాది మంది తాలిబన్లు.. ఉత్తరం వైపు కదిలారు.

అయితే తాలిబన్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది నార్తన్‌ అలయన్స్‌..! బాగ్లాన్ ప్రావిన్స్‌లోని అర్బారాద్ దగ్గర రెండు బలగాలకు మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది. ఇందులో తాలిబన్లకు చెందిన 300 మంది చనిపోయారని.. ఇంకొందరు లొంగిపోయినట్లు పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ నేతలు చెబుతున్నారు. కానీ తాలిబన్లు మాత్రం ఈ వార్తను ధృవీకరించడం లేదు. మరోవైపు పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ సరిహద్దుల్లోనూ రెసిస్టెన్స్‌ బలగాలకు, తాలిబన్లకు మధ్య బీకర పోరు జరిగింది. అటు పంజ్‌షీర్‌పై కన్నేసిన తాలిబన్లు.. ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే… పంజ్‌షీర్‌ తరహలోనే మిగతా ప్రావిన్స్‌ లు తాలిబన్లను ఎదుర్కొవాలని ఆలోచన చేస్తున్నాయట. నిజంగా ఇదే జరిగితే.. తాలిబన్లకు ఇబ్బంది తప్పక పోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version