ఎన్టీఆర్‌ అదిరిపోయే డైలాగులతో ”మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోమో రిలీజ్‌

-

”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బాగా ఇష్ట పడతారు. అయితే…. ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షోకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా రానున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ రియాలిటీ సో కరోనా మహమ్మారి కారణంగా చాలా ఆలస్యం అయింది. కరోనా మహమ్మారి లేకపోతే… ఈ పాటికీ టీవీల్లో ఈ షో టెలికాస్ట్‌ అయ్యేది.

అయితే.. తాజాగా ఈ ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ షోకు సంబంధించిన ఓ అదిరిపోయే ప్రోమో వీడియోను రిలీజ్‌ చేసింది జెమినీ టీవీ యాజమాన్యం. ఈ మేరకు తమ ట్విట్టర్‌ వేదికగా ప్రోమోను రిలీజ్‌ చేసింది. ఇక ఈ ప్రోమోలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తనదైన స్టైల్‌ లో డైలాగ్‌ లు చెప్పారు. ప్రోమో చూశాక… ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో ప్రేక్షకులను మరో రేంజ్‌ కు తీసుకెళ్లింది. కాగా.. ఈ షోకు సంబంధించిన అని ఎపిసోడ్స్‌ షూటింగ్‌ దశలో ఉన్నాయని సమాచారం. ఈ నెల 16 నుంచి టీవీలో ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో ప్రసారం కానున్నట్లు టాక్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version