సెప్టెంబర్ 5న హుజురాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రహదారి బంగలాలో మంద కృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత బంధు పేరుతో దళితులను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో దళితులు మోసపోకుండా దళిత చైతన్య సదస్సులు నిర్వహిచనున్నామన్నారు.
రేపటి నుంచి అన్ని జిల్లాల్లో సదస్సులు ప్రారంభమవుతాయి ఈనెల 9 నుంచి జిల్లా కలెక్టరేట్ల ముందు దళితుల సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 15వ తారీకు లో అన్ని జిల్లాలో మండల కేంద్రాల్లో మహా దీక్షలు నిర్వహిస్తున్నామని.. 16వ తారీఖుకు నుంచి అన్ని నియోజకవర్గాల్లో దళిత చైతన్య యాత్రల పేరుతో పాదయాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు. దళితులు తెలంగాణలో 19 శాతం ఉన్నారని వారికి… 19 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. దళిత బందును హుజురాబాద్ నియోజకవర్గంలో ఎలక్షన్ల కంటే ముందే అమలుచేయాలని.. అలాగే…119 నియోజక వర్గాలలో అమలు చేయాలని డిమాండ్ చేశారు..