అవకాశాలు లేకపోయినా తగ్గని రానా డిమాండ్.. ఎన్ని కోట్లంటే..?

-

దగ్గుబాటి హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించలేదని చెప్పాలి. ఇక దాదాపు ఈయన నటించిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. చాలాకాలం తర్వాత మళ్లీ ఆయన నిఖిల్ హీరోగా వచ్చిన స్పై మూవీ సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల అయ్యింది కానీ ఆ అంచనాలను అందుకోలేక అట్టర్ ప్లాప్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో రానా గెస్ట్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాకి రానా నటన హైలెట్ గా నిలవడమే కాదు ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా లభిస్తుంది. ఇకపోతే ఈ పాత్ర గురించి ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే.. స్పై మూవీ మేకర్స్ ఈ పాత్ర కోసం మొదట నాగచైతన్యను సంప్రదించారట. కానీ ఆయన సినిమా షూటింగ్ సమయంలో విదేశాలలో ఉండడంతో నిఖిల్ కి సన్నిహితుడైన రానా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

ఇకపోతే ఈ సినిమాలో కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించే పాత్ర కోసం రానా ఏకంగా 40 లక్షల రూపాయల పారితోషకం తీసుకున్నారు అని సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఇది చాలా ఎక్కువ అమౌంట్ అని చెప్పాలి. ఇకపోతే ఒకవైపు సినిమాలు లేకపోయినా మరొకవైపు ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు అని అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version