ఆ వ్యక్తిని నమ్మి అన్ని లక్షలు పోగొట్టుకున్నా.. జబర్థస్త్ వినోద్..!

-

జబర్దస్త్ లో లేడీ గెటప్పులతో బాగా పాపులర్ అయిన వారిలో జబర్దస్త్ వినోద్ కూడా ఒకరు. తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర ,వినోద్ కాంబినేషన్లో వచ్చే ప్రతి స్కిట్ కూడా సూపర్ అని చెప్పవచ్చు. వినోద్ పంచ్ డైలాగులు చమ్మక్ చంద్ర పంచ్ డైలాగులు ఎప్పుడు సెటైర్స్ వేస్తూ ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసేలా అనిపిస్తూ ఉంటాయి. గడచిన కొద్ది రోజుల నుంచి వినోద్ జబర్దస్త్ లో అసలు కనిపించలేదు దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

వినోద్ జబర్దస్త్ లోకి రాకపోవడానికి తన జీవితంలో కొన్ని చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయట. లేడీ గెటప్ లో ఎంతోమంది నవ్వించిన వినోద్ ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయారని తెలుస్తోంది. ముఖ్యంగా అతడు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడంతో ఒక్కసారిగా బక్క చిక్కిపోయి పూర్తిగా గుర్తు పట్టలేని స్థితికి మారిపోయినట్లు తెలుస్తోంది.ఆ మెడిసిన వల్ల సైడ్ ఎఫెక్ట్లో వచ్చాయని కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భార్యతో కలిసి తెలియజేశారు వినోద్ .అయినా సరే తాను తిరిగి కోలుకొని అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చాలా నమ్మకంగా చెబుతున్నాడు వినోద్.

తన జీవితంలో కొంతమందిని నమ్మి తాను సంపాదించిన వాటిలో భారీగానే కోల్పోయానని తెలిపారు. సొంతగా ఇల్లు కొనుక్కునేందుకు ఒక వ్యక్తికి దాదాపుగా రూ.13 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయానని తెలిపారు. ఇల్లు కొనుక్కునేందుకు ఇంటి యజమానితో ఒప్పందం కుదురుచుకొని అడ్వాన్సుగా 13 లక్షలు డబ్బులు ఇవ్వగా.. నోటిమాట ద్వారా రూ .3లక్షలు లిఖితపూర్వకంగా రూ.10 లక్షలు ఇచ్చానని తెలిపారు. అయితే ఆ సదరు వ్యక్తి వినోద్ ను వేధిస్తూ ఉండడంతో పాటు డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదని తెలియజేశారు. దాదాపుగా ఏడాది పాటు తిరుగుతున్న న్యాయం దొరకలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version