ఆ వీడియోలు చూసినా, షేర్ చేసినా మీ పని ఇక అంతే.. నేరుగా జైలుకే!

-

సోషల్‌‌మీడియాలో అశ్లీల చూత్రాలు వీక్షిస్తున్న వారిపై పోలీసులు నిఘాను పెంచారు. ప్రస్తుతం సైబర్ పెట్రోలింగ్‌ను పెంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. చిన్నారులపై రోజురోజుకూ లైంగిక దాడులు పెరుగుతున్న క్రమంలో వాటివెనుక అశ్లీల వీడియోల ప్రభావం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. దీంతో అమెరికాలోని ఓ నిఘా సంస్థతో తెలంగాణ పోలీసులు ఒప్పందం చేసుకున్నారు. ఆ సంస్థ సాయంతో నెట్టింట నీలి చిత్రాలు, వీడియోలు చూడటమే కాకుండా, వారిని మహిళలు, యువతులు, ఇతరులకు షేర్ చేసినా ఇట్టే తెలిసిపోనుంది.

వారి ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్, లొకేషన్‌లను అమెరికా నిఘా సంస్థ క్రైం బ్యూరో రికార్డు ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం అందుతుంది.దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఇటువంటి వ్యక్తులపై పక్కా ఆధారాలతోనే వారిపై భారతీయ న్యాయ సంహిత పొక్సో,ఐటీ కింద ఐదేళ్ల శిక్ష విధిస్తామని సీపీ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ‘మన పిల్లలను మానవ మృగాల నుంచి కాపాడుకుందాం,నేర రహిత సమాజంలో భాగస్వాములవుదాం’ అంటూ ఆదివారం రాచకొండ పోలీసులు ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version