తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో యోగా

-

విద్యార్థులకు చదువుతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు బడిలో ప్రతి రోజూ 5 నిమిషాల పాటు యోగా లేదా ధ్యానం చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్లో యోగా, ధ్యానం కూడా చేర్చారు. నెలలో ప్రతి మూడో శనివారంను నో బ్యాగ్‌ డేగా పాటిస్తారు. ఆ రోజు విద్యార్థులంతా పుస్తకాలు, నోటుబుక్స్‌ లేకుండా బడికి రావాల్సి ఉంటుంది.

ఈ రోజున బడుల్లో బాలసభను నిర్వహిస్తారు. అలాగే, ప్రతి నెలా నాలుగో శనివారం స్వచ్ఛ స్కూల్/ హరితహారం చేపట్టాలని 2022–23 విద్యా సంవత్సరం క్యాలెండర్‌లో స్పష్టం చేశారు అధికారులు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరిచేందుకు, పాఠశాలలు అన్ని తరగతులకు ఆంగ్లంలో కమ్యూనికేటివ్ స్కిల్స్ కోసం వారంలో ఒక పీరియడ్‌ను కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో ఆంగ్లంలో వార్తాపత్రిక చదవడం, కథలు చెప్పడం, కథల పుస్తక పఠనం, డ్రామా/స్కిట్ మొదలైనవి చేర్చారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version