మద్యం మత్తులో స్నేహితులతో కలిసి ఓ మహిళపై దారుణం..

-

మద్యం కిక్కు నెత్తికెక్కి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఎంతోమంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం సేవించే అఘాయిత్యాలకు పాల్పడ్డ ఘటనలు వెలుగు చూసాయి. అయితే ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌కు నిప్పంటించిన న‌లుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశారు పోలీసుల. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని పోలీసులుజూన్‌ 28న ఈ దారుణం వెలుగుచూసింది. ప్రధాన నిందితుడిని అమిత్ రాయ్‌, బాధితురాలిని మ‌ధుగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అమిత్ రాయ్ బాధితురాలి ఇంటి వెలుప‌ల నిలుచుని ఉండ‌గా మ‌హిళ త‌ల్లి అత‌డిని అక్క‌డి నుంచి వెళ్లాల‌ని కోరింది. దీంతో ఆగ్ర‌హానికి లోనైన నిందితుడు మ‌రో ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి బాధితురాలికి నిప్పంటించాడు. స్ధానికులు మంట‌లు ఆర్పి ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌ద్యం మ‌త్తులో ఈ నేరానికి పాల్ప‌డిన‌ట్టు నిందితుడు అంగీక‌రించినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఘ‌ట‌న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావ‌డంతో న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version