జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందే:ఏపీలో సంచలన ఆదేశాలు

-

విశాఖలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో చాల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో కలెక్టర్ వి.వినయ్ చంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 24 జీవీఎంసీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పని చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా మరో 45 వరకు త్వరలో యుద్ధ ప్రాతిపధికన చేస్తున్నట్లు వెల్లడించారు.

Vizag-collector

ప్రతి వార్డ్ లో పిహెచ్ సి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు. కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరు హాస్పిటల్ లో ఉండాలని నిబంధన లేదని తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న కోవిడ్ రోగులను మాత్రమే ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తామన్నారు. విశాఖలో 14 ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే కోవిడ్ చికిత్స అందించే అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. అంతేకాకుండా బెడ్స్ స్టేటస్ ఎప్పటికప్పుడు తెలిసేలా ఒక యాప్ కూడా అందుబాటులో తీసుకొచ్చినట్లు ఆయన తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version