సిఎం జగన్ కు మాజీ క్రికెటర్ MSK ప్రసాద్ లేఖ.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి !

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ రాశారు. విశాఖలో ఉన్న మానసిక వికలాంగుల స్కూల్ కూల్చివేత పై జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెస్కే ప్రసాద్ లేఖ రాశారు. స్కూల్ కూల్చివేత ఘటన దారుణమని..ఇలాంటి చర్య సరికాదని లేఖ లో ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు. 140 మంది మానసిక వికలాంగులైన చిన్నారులు అక్కడ ఆశ్రయం పొందుతున్నారన్నారు. అలాంటి పాఠశాలను కూల్చివేయాలని జివిఎంసి అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెస్కే ప్రసాద్.

అంతేకాదు ఆ పాఠశాలను తిరిగి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ , ఎంపి విజయసాయి రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఆ పాఠశాల మానసిక వికలాంగులైన చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని.. అలాంటి పాఠశాలను కూల్చివేయడం చాలా దారుణం అని లేఖలో పేర్కొన్నారు. కాగా విశాఖ లో మానసిక వికలాంగులకు చదువు చెప్పే పాఠశాలను శనివారం జీవీఎంసీ అధికారులు కూలగొట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version