దమ్ముంటే నాపై గెలువు.. ఎమ్మెల్యే మేకపాటికి సవాలు విసిరిన మాజీ ఎంపీపీ !

-

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మరియు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుండి వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీనితో ఇద్దరూ కూడా పార్టీ పైన హద్దుమీరి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక వీరిద్దరి కామెంట్ లపై వైసీపీ నాయకులు కౌంటర్ లు ఇస్తున్నారు.

తాజాగా ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సవాలు విసిరాడు. నెల్లూరు లో మీడియా ముందు మాట్లాడిన సుబ్బారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నది వెన్నుపోటు రాజకీయాలని, కోట్ల రూపాయల కోసం ఎంతొహ్ విలువైన ఓటును ప్రతిపక్షానికి అమ్ముకున్నాడని శివాలెత్తారు. దమ్ముంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా నాపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరాడు. మరి ఈ వ్యాఖ్యలపై ఉదయగిరి ఎమ్మెల్యే ఏమైనా రెస్పాండ్ అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version