పోస్టాఫీసు లో అద్భుతమైన స్కీమ్.. రూ.5వేల పెట్టుబడితో రూ.8 లక్షల ఆదాయం… పూర్తి వివరాలు..

-

Post office: ప్రముఖ ప్రభుత్వ శాఖ అయిన పోస్టాఫీసు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా ఉండటంతో ఎక్కువ మంది ఈ పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్మె చేస్తున్నారు.. పోస్టాఫీసు ఆర్డీ స్కీమ్స్ చిన్న పొదుపు పథకాల కిందకు వస్తాయి. ఇంతకు ముందు వీటిపై వడ్డీ 5.8 శాతంగా ఉంది. అయితే 2023 ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం 6.2 శాతానికి పెంచింది. దీంతో ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ వీరిపై దృష్టి సారిస్తున్నారు..

Post office

ఇందులో స్కీమ్స్‌లో రెగ్యులర్ రికరింగ్ డిపాజిట్ , ఫ్లెక్సీ రికరింగ్ డిపాజిట్ వంటి రెండు రకాలు ఉన్నాయి. రెగ్యులర్ ఆర్డీ స్కీమ్స్‌లో నిర్ణీత కాలానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 4000 మొత్తాన్ని డిపాజిట్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే ఫ్లెక్సీ రికరింగ్ డిపాజిట్‌లో కస్టమర్లు అవసరానికి అనుగుణంగా నెలవారీ డిపాజిట్‌ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.

అలాగే ఈ స్కీమ్ లలో ముందే డబ్బులను డిపాజిట్ చెయ్యాల్సిన పనిలేదు..దీనికి బదులుగా ప్రతి నెలా చిన్న మొత్తాలను డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీ అందుతుంది.. ఇందులో వడ్డీ తక్కువగానే ఉంటుంది.. ఐదేళ్లు నుంచి పదేళ్లు మెచ్యూరిటీ టైమ్ ఉంటుంది.. పోస్టాఫీసులో ప్రతి నెలా 5000 రూపాయలను ఆర్డీలో డిపాజిట్ చేస్తే.. 6.2 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల తర్వాత రూ.3.52 లక్షలు అందుకోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం రాబడి 8.32 లక్షలకు పెరుగుతుంది. అయితే వడ్డీ రేటు తదితర వివరాల కోసం దగ్గరలోని పోస్టాఫీసులో తెలుసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version