ఎప్పటి నుండో మీరు కారుని కొనాలని అనుకుంటున్నారా..? కానీ కుదరడం లేదా..? అయితే తప్పక మీరు ఈ అదిరే ఆఫర్ ని చూడాలి. ఇప్పుడు పండుగ సీజన్ నడుస్తోంది కనుక తక్కువ ధరకే వాహనాలు కొనుగోలు చేసి డబ్బులని ఆదా చెయ్యచ్చు. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
మీరు కొత్తగా కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? లేదంటే ట్రాక్టర్ ఇంటికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారా? అయితే ఇది నిజంగా మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మంచి ఆఫర్స్ వున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా ఫైనాన్స్ ఆకర్షణీయ డీల్స్ అందిస్తోంది. దీనితో వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది.
పండుగ సందర్భంగా మహీంద్రా ఫైనాన్స్ తాజాగా ఆకర్షణీయ ఫైనాన్స్ స్కీమ్స్‌ను తీసుకొచ్చింది. అయితే ఇవి నవంబర్ నెల చివరి వరకు ఉంటాయి. ఇందులో భాగంగా లోన్ తీసుకొని కారు, ట్రాక్టర్ కొనే వారికి ప్లస్ అవుతుంది. మహీంద్రా ఎస్యూవీ కార్లు కొనుగోలు చెయ్యాలంటే తక్కువ వడ్డీ రేటుకే రుణాలు పొందొచ్చు. 7.35 శాతం నుంచి వడ్డీ రేటు మొదలు అవుతోంది. పైగా ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు కూడా వస్తుంది.
మీరు తీసుకున్న రుణాన్ని 7 ఏళ్లలో తిరిగి చెల్లించొచ్చు. అలానే కారు ధరకు సమానమైన మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు. అలాగే ట్రాక్టర్ రుణాలపై కూడా ఆఫర్ ఉంది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు పొందొచ్చు. అలాగే బై నౌ పే 60 డేస్ స్కీమ్ కూడా.