ఈరోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులను పెంచటం ఎక్కువైంది. కొందరు కుక్కలను, మరికొందరు పిల్లులను ఇంకా చాలా రకరకాల జంతువును పెంచుతుంటారు. అయితే ఎక్కవ మంది కుక్కలను పెంచటానికే ఇష్టపడతారు. సెలబ్రెటీల దగ్గర నుంచి మొదలు సామన్యుల వరకూ అందరికి ఇంట్లో కుక్కలను పెంచటం అంటే ఇష్టం ఉంటుంది. కొంతమంది అయితే కన్నబిడ్డలను చూసుకున్నట్లు వాటిని అపూరూపంగా చూసుకుంటారు. సకల సౌకర్యాలు కల్పిస్తారు. మంచి మంచి ముద్దుపేర్లు పెట్టుకుని పిలుస్తుంటారు. అయితే మీ పెంపుడు కుక్కలకు సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవిమీకు ఆశ్యర్యం కూడా కలిగించవచ్చేమో.
వాసన పసిగట్టే లక్షణం కుక్కలకు మనిషి కంటే వేలాది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పరిశోధనలో కుక్కలపై ఎక్కువ భరోసా పెట్టుకోవచ్చు. అందుకే పోలీసులు కూడా తమ ఇన్వస్టిగేషన్లో అప్పుడప్పుడు కుక్కలను బాగా నమ్ముతారు. ఆ లక్షణం కారణంగానే అంతరిక్షంలో ముందుగా కుక్కనే పంపించారు. దాదాపు 150 పదాల వరకూ కుక్క నేర్చుకుంటుందని చెబుతారు.
కాస్త అలికిడైనా సరే కుక్కలు అప్రమత్తమవుతాయి. ఓ అరిచేస్తాయి. మనం అవి ఎక్కువగా నిద్రపోవని అనుకుంటాం.కానీ అది కానే కాదు. లైవ్‌సైన్స్ వెబ్‌సైట్ రిపోర్ట్ ప్రకారం కుక్కలు మనిషి కంటే ఎక్కువగా పడుకుంటాయట. ఈ విషయంపై రీసెర్చ్ కూడా జరిగింది.
మనలానే కుక్కలు కూడా కలలు కంటాయి. చాలాసార్లు కుక్కలు నిద్రలో కాళ్లు ఊపుతూ కన్పిస్తుంటాయి కదా. వాస్తవానికి అవి నిద్రలో కలలు కనే సమయంలోనే అలా చేస్తుంటాయట.
కేవలం మనిషికే కాదు కుక్కల్లో కూడా ఓ లక్షణం ఉంటుంది. ఎదుటి వ్యక్తి కళ్లలో చూసి అతడి హావభావాల్ని లేదా మూడ్‌ను పసిగట్టగల లక్షణం కుక్కల్లో ఉంటుందట. అందుకే కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వాటితో కొన్ని రకాల పనులు చేయించుకుంటుంటారు. ఇంకా మనం ఒకవేళ కోపంగా అరిస్తే వాటికి అర్థమయిపోతుంది. అవతలి వ్యక్తి కోపంగా ఉన్నాడా లేదా ప్రశాంతంగా ఉన్నాడా అనేది కుక్కలు కళ్లు చూసి పసిగట్టేస్తాయిట.
కుక్కలకు విశ్వాసం ఎక్కువ అని మనకు తెలిసిందే.. కుక్కల్ని మించిన విశ్వాసపు జంతువులు లేనేలేవు. కుక్క మనిషి ప్రాణాలను కాపాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి మీ కుక్కకూడా నిద్రలో కాళ్లు ఊపుతుందేమో గమనించండి.
– Triveni Buskarowthu