సాధారణంగా ప్రస్తుతం ఎంతో ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వాలు వంతెన కడుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇక్కడ ప్రభుత్వం వంతెన కట్టింది కానీ ప్రజల కోసం కాదు ఏకంగా జంతువుల కోసం జంతువులను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంతెన నిర్మించింది. సాధారణంగా రోడ్డు దాటుతున్న సమయంలో ఎన్నో జంతువులు రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం సుకున్న అటవీ శాఖ జంతువుల రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టింది. జంతువుల కోసం ఒక ప్రత్యేకమైన వంతెన నిర్మించింది. కలదుంగ – నైనిటాల్ అటవీ మార్గంలో ఈ వంతెనలు ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. జనపనార వెదురు గడ్డితో ఈ వంతెన నిర్మించిన అధికారులు కేవలం నలభై రోజుల వ్యవధిలోనే ఈ వంతెన పూర్తి చేశారు. దాదాపు 90 మీటర్ల పొడవు ఉంది ఈ వంతెన.