ప్రేమించడం అందరికీ తెలుసు. కానీ ప్రకటించడమే రాదు. అందుకే బయటకి ఏమీ చెప్పకుండానే రహస్యంగా ప్రేమిస్తూ ఉంటారు. పెళ్ళికాక ముందు ఇలా ప్రేమించడం వల్ల అవతలి వారికి పెద్దగా నష్టం ఉండదు కానీ, పెళ్ళయ్యాక మీరు ప్రేమని తెలియజేయాల్సి ఉంటుంది. మాటల ద్వారా కాకుండా, మీరు చేసే పనుల ద్వారా, మీ భాగస్వామిపై మీకెంత ప్రేమ ఉందో తెలియజేయాల్సి ఉంటుంది. తెలియజేస్తే తప్ప ప్రేమ లేనట్టా అంటే, తెలిపితే మీపై ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రేమని తెలియజేసే టిప్స్
నువ్వు చాలా అందంగా ఉన్నావు అని తరచుగా చెప్తూ ఉండండి. ఆ మాటలు మీ మనసులోంచి వస్తే మరింత బాగుంటుంది.
తన పుట్టినరోజుని గుర్తుంచుకుని బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేయండి. ఖరీదైన బహుమతే ఇవ్వాలన్న రూల్ లేదు. కానీ, మీరిచ్చారన్న ఫీలింగ్ అంతకంతే ఖరీదైనదని తెలుసుకోండి.
భాగస్వామి చెప్పేది వినండి. ముఖ్యంగా ఆడవాళ్ళ మాటలు వినాలి. తమ మాటలకి గౌరవం ఇచ్చేవారినే ఎవరైనా ఇష్టపడతారు.
ఎక్కడికైనా వస్తానని చెప్పినపుడు చెప్పిన టైమ్ ప్రకారం అక్కడ ఉండండి. ట్రాఫిక్ జామ్ అయ్యింది లాంటి అర్థం లేని కారణాలు చెప్పవద్దు.
మీ భాగస్వామి మీతో లేనపుడు మీ మాజీలతో సమయం గడపవద్దు. ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించుకోండి.
వంట బాలేదని తెలిసినపుడు అందరి ముందర విమర్శించవద్దు. ఒక్కరే ఉన్నప్పుడు అర్థమయ్యేలా చెప్పండి. మొహం మీద చెప్తే అహం దెబ్బతింటుంది. అప్పుడు మీ మీద ప్రేమ కాదు కోపం పెరుగుతుంది.