ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త దిశగా అడుగులు వేస్తోంది. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశం ఉంది.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈనెల 17న స్కూళ్లు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సెలవులను ఈనెల 18 వరకు పొడిగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు మంత్రి బొత్సను కోరాయి. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.