HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఆడపిల్లలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 400 ఎకరాల యూనివర్సిటీ భూములను వేలం వేయొద్దని విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్న తరుణంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే HCUకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఆందోళన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పీఎస్‌కు తరలిస్తున్నారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం జేసీబీలను వెంటనే వెనక్కి పిలిపించాలని, అక్కడున్న వన్యప్రాణలు, పక్షులను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news