వైసిపి కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపినా కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు. కక్ష సాధింపులో భాగంగా తమపై కేసులు పెడుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీని వీడియో ప్రసక్తి లేదన్నారు పేర్ని నాని.

రేషన్ బియ్యం కుంభకోణం కేసులో పెర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మచిలీపట్నం పోలీసులు. ఇలాంటి నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నాని… సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపించిన పర్వాలేదు కానీ.. జగన్మోహన్ రెడ్డిని మాత్రం వీడేది లేదన్నారు.