కంటి అలసట.. కళ్ల లోపల నొప్పులు కూడా ఉన్నాయా..?

-

కళ్లు లేకపోతే ఒక మనిషి జీవితం అంధకారంలోనే ఉంటుంది. కళ్లు మనిషికి ఎంత ముఖ్యమే అది లేనివారికి మాత్రమే తెలుస్తుంది. రోజు తిరిగే ఇళ్లైనా కళ్లు మూసుకుని మీరు నడవలేరు. కళ్ల ఆరోగ్య విషయంలో చాలామందికి పెద్దగా శ్రద్ధ ఉండదు. ఏదో డార్క్‌ సర్కిల్స్‌ వచ్చి అందం దెబ్బతింటుందని కేర్‌ చూపిస్తాం కానీ..కళ్ల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టరు. లైట్స్‌ ఆపేసి ఫోన్‌ వాడటం, టైమ్‌తో సంబంధం లేకుండా స్ర్రీన్‌ చూడడం అందరూ చేస్తుంటారు. కళ్లు అలిసిపోయి నిద్రకు వచ్చినా ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. ఈ పరిస్థితుల్లో తరచు కళ్లు అలిసిపోవడం, కళ్లలో నొప్పి రావడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలికంగా జరిగితే చాలా ప్రమాదం.. ఈ చిట్కాలతో ఈ సమస్యను నివారించుకోవచ్చు.

మీ కళ్లు అలసిపోయినట్లు అనిపిస్తే పచ్చి బంగాళదుంపలను ఉపయోగించవచ్చు. ఇది కళ్ల చికాకు, అలసటను తగ్గిస్తుంది. దీన్ని ఉపయోగించడానికి బంగాళాదుంపను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మీ కళ్లపై కాసేపు ఉంచండి. దీంతో కంటి అలసట తగ్గుతుంది.

అలోవెరా జెల్ కంటి అలసటను తొలగించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్‌ను కళ్లపై కొంత సమయం పాటు ఉంచండి. అది అలసటను దూరం చేసి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

కంటి అలసట, బలహీనతను తొలగించడానికి కీర దోసకాయను కూడా వాడొచ్చు. దీన్ని ఉపయోగించడానికి, రెండు దోసకాయ ముక్కలను తీసుకోండి. మీ కళ్లపై ఉంచండి. కొంత సమయంపాటు విశ్రాంతి తీసుకోండి. దీంతో కంటి అలసట తగ్గుతుంది. ఈ టెక్నిక్‌ అందరికీ తెలుసు కానీ చాలా తక్కువ మందే పాటిస్తారు. కళ్లకు కీరాదోసకాయ చాలా బాగా పనిచేస్తుంది.

కంటి అలసటను తొలగించడానికి చల్లని పాలను ఉపయోగించవచ్చు.. ఇది కళ్లలో ఉండే ఇన్ఫెక్షన్, అలసటను తొలగిస్తుంది. పాలను కాటన్‌లో మంచి దాన్ని కళ్లపై పెట్టుకోవాలి. ఇది మీ అలసటను తగ్గిస్తుంది.

ఏం చేసినా కళ్లలోకి పోకుండా చేసుకోవాలి. కంగారుపడి..కళ్లలో పోసుకుంటే మళ్లీ మండుతుంది. నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. నీట్‌గా నిదానంగా చేయాలి. ఇంట్లో ఎప్పుడూ కీరాదోసకాయను ఉంచుకుంటే.. డైలీ నైట్‌ పడుకునేప్పుడు కట్‌ చేసుకుని పెట్టుకోని నిద్రపోవచ్చు. దీనివల్ల నిద్ర కూడా త్వరగా పడుతుంది. కళ్లకు హాయిగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version